Digital Marketing Course in Telugu

మీకొసం డిజిటల్ మార్కెటింగ్ classes ఇప్పుడు తెలుగు లో

ENROLL FOR A FREE DEMO CLASS ఫ్రీ DEMO CLASS కోసం రిజిస్టర్ అవ్వండి

Digital Marketing in Telugu

ప్రస్తుతం వున్న కాలంలో డిజిటల్ మార్కెటింగ్ చాలా ప్రాముఖ్యత కలిగినది . ఇప్పుడు వున్న ప్రతి వ్యాపారులు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా తన వ్యాపారము అభివృద్ధి చేసుకుంటున్నారు.

digital marketing course in telugu

1. మార్కెటింగ్ అంటే ఏంటి ?

మన దగ్గర వున్న ప్రొడెక్టుని ఆ ప్రోడక్ట్ యొక్క గొప్పతనాన్ని ,మన ప్రోడక్ట్ ఎవరయితే కొంటారో ,కొనగలరో వాళ్ళకి తెలిసేలా చేయడమే మార్కెటింగ్ అంటారు .

2. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి ?

డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంటర్నెట్ ద్వారా లేదా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఒక వస్తువును ప్రమోట్ చేయడం. డిజిటల్ మార్కెటింగ్ అంటే బయట చేసే మార్కెటింగ్ని ఇంటర్నెట్లో చేయడమే డిజిటల్ మార్కెటింగ్ అంటారు.ఇందులో సెర్చ్ ఇంజిన్ ,సోషల్ మీడియా ,బ్లాగింగ్, ఇమెయిల్ ,వీడియో చానెల్స్ ,ఈ డిజిటల్ చానల్స్ ని ఉపయోగిస్తారు. ఒక వస్తువుని లేదా సర్వీసుని,సోషల్ మీడియా లేదా ఇంటర్నెట్లో వుండే కస్టమర్లను కొన్ని రకాల ద్వారా అట్ట్రాక్ట్ చేసి మన వస్తువుని కస్టమర్లను కొనేలా చేయడమే డిజిటల్ మార్కెటింగ్ ముఖ్య ఉద్దేశం. ఇంతకముందు హోర్డింగ్లు ,న్యూస్ పేపర్లు మొదలైన వాటితో మార్కెటింగ్ చేసేవాళ్ళం,ఇప్పుడు డిజిటల్ మీడియాతో ప్రోడక్ట్ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే డిజిటల్ మార్కెటింగ్ అంటారు.గూగుల్ లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు మొదటి పేజీలో మన ప్రోడక్ట్ వివరాలు ర్యాంకింగ్ కోసం యూస్ చేసే టెక్నిక్ ని సెర్చ్ ఇంజిన్ అంటారు.

Digital Marketing Course in Telugu Advantages:

1. Precise Targeting

2. Real-Time Optimization

3. Higher ROI

4. Measurable

5. Cost Effective

6. Personalize Communication

7. Build Engagement

3. డిజిటల్ మార్కెటింగ్ ఎవరికీ అవసరం ?

ప్రస్తుతం ఉన్న కాలంలో ఇది అందరికీ అవసరమే . ఎందుకనగా ప్రస్తుత ప్రపంచం ఇంటర్నెట్ లో నడుస్తుంది. ఆన్లైన్ ఉపయోగించుకొని చేసే ప్రతి వ్యాపారానికి డిజిటల్ మార్కెటింగ్ అవసరం ఉదాహరణకు ఫుడ్ డెలివరీలు ,టికెట్ బుకింగ్లు ,ఈకామర్స్సైట్లు వీళ్ళందరికీ డిజిటల్ మార్కెటింగ్ చాలా ముఖ్యమైనది,దీని ద్వారానే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. డిజిటల్ మార్కెటింగ్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. ప్రస్తుతం వున్న కాలంలో మనిషి ఆన్లైన్ లో ప్రొడక్ట్స్ అమ్మాలి అనుకునేవారికి లేదా తమ వ్యాపారాన్ని ఆన్లైన్ ద్వారా ప్రమోట్ చేసుకోవాలి అని చూసే వారికి ఈ డిజిటల్ మార్కెటింగ్ చాలా ఉపయోగపడుతుంది .

4. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి ?ట్రెడిషనల్ మార్కెటింగ్ ఆన్లైన్ మార్కెటింగ్ కు ఉన్న తేడాలేంటి ?

మార్కెటింగ్ అనేది ఎప్పటి నుంచో మనం చూస్తూనే వున్నాం. ఇంతకముందు మార్కెటింగ్ అంటే ఏదైనా కొత్త వస్తువు మార్కెట్ లోకి వచ్చినప్పుడు న్యూస్ పేపర్ లో కానీ ,హోర్డింగ్ లో లేదా ఇంటి వద్దకు వచ్చి ప్రోడక్ట్ యొక్క ఉపయోగాలు వ్యక్తపరిచేవారు. దీనిని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు . ట్రెడిషనల్ మార్కెటింగ్ ద్వారా కస్టమర్లకు ప్రోడక్ట్ గురించి అందరికీ తెలియజేసేవారు కానీ ఎవరికీ ఐతే ప్రోడక్ట్ కావాలో particularga advertisement ఇవ్వలేరు. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ప్రోడక్ట్ కావాల్సిన వారికి మాత్రమే మనం టార్గెట్ చేసి advertisement ఇవ్వగలం.ట్రెడిషనల్ మార్కెటింగ్ లో మ్యాగజిన్ ,టీవీ యాడ్స్ ,డిస్ప్లే  యాడ్స్ ఉపయోగించి మార్కెటింగ్ చేసేవాళ్ళు . డిజిటల్ మార్కెటింగ్ లో blogging,సోషల్ మీడియా సెర్చ్ ,influencer మార్కెటింగ్ ,ఇమెయిల్ ద్వారా మార్కెటింగ్ చేస్తున్నామ్.

5. డిజిటల్ మార్కెటింగ్ ఎవరు చేయవచ్చు ?

ఇది particular గ వీళ్ళే చేయాలనీ ఏమి లేదు . విధ్యార్ధులు దీనిని కెరీర్ గా మార్చుకుందామనే వారు నేర్చుకోవచ్చు . ఇప్పటికే ఒక కంపెనీ లో వర్క్ చేస్తూ ఉంటే దీనిని part time గా కూడా చేసుకోవచ్చు లేదా మీ వ్యాపారాన్ని దీని ద్వారా వృద్ధి చేసుకోవాలి అనుకునేవారు కూడా నేర్చుకోవచ్చు . 

డిజిటల్ మార్కెటింగ్ ముఖ్యమైన అంశాలు మరియు వివరణ :

1.వెబ్సైట్ తయారుచేయడం

2. సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్

3. సోషల్ మీడియా మార్కెటింగ్

4.గూగుల్ అనలిటిక్స్

5.గూగుల్ ఆడ్వర్డ్స్

6.ఇమెయిల్ మార్కెటింగ్

7.ఫేస్బుక్ మార్కెటింగ్

8.యూట్యూబ్ మార్కెటింగ్

9.అఫిలియేట్ మార్కెటింగ్

10.ఇన్ఫ్లుయెన్సుర్ మార్కెటింగ్

1. వెబ్సైట్ తయారుచేయడం

ఇది అందరికీ తెలిసిన విషయమే . కొందరికి దినిని ఎలా మొదలు పెట్టాలి ఎలా ఉపయోగించాలి అనేది తెలియదు . డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అనేవారికి వెబ్సైట్ రూపొందించడం చాలా ప్రధానమైనది . వెబ్సైట్ క్రియేషన్కి domain  ,hosting space అనేవి మనకు కావాల్సిన పేరుతో ఉన్నాయో లేదో చూసుకొని మంచి వెబ్సైట్ లో కొనుగోలు చేసి ,అందులో wordpress install చేయడం తెలుసుకోవాలి .Domain, Hosting అనేవి Godaddy, Bluehost, Hostgator మొదలైన siteslo కొనుగోలు చేసుకోవచ్చు . వెబ్సైట్ డిజైనింగ్ ,వెబ్సైట్ అభివృద్ధి చేయడం కూడా తెలుసుకొని ఉండాలి మరియు ఈ కామర్స్ ,ఆన్లైన్ అమ్మకాలు ఎలా చేయాలో కూడా తెలుసుకొని ఉండాలి. 

2. సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్

ఇది డిజిటల్ మార్కెటింగ్ లో చాలా ముఖ్యమైనది . ఏదైనా ఒక వెబ్సైట్ ని మొదటి పేజీలో వచ్చేలా చేయడమే సెర్చ్ ఇంజిన్ optimization. దీనికి చాలా ఓపికగా ఉండాలి కానీ ఖర్చు లేనిది. ఉదాహరణకు ఏదైనా google లో సెర్చ్ చేసినప్పుడు మనం google మొదటి పేజీలో ఉండే వెబ్సైట్నే మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. అలా చాలా పేజీలు వున్నా కూడా మొదటి పేజీలో ఉన్న వెబ్సైట్లుకి మాత్రమే ప్రాముఖ్యతనిస్తాం . అయితే అలా మొదటి పేజీలో ఒక వెబ్సైట్ని తీసుకురావడం కోసం చేసేదాన్ని సెర్చ్ ఇంజిన్ optimization . దీని కోసం backlinks ,blog posts ,page creation,మొదలైనవి చేయడం ద్వారా వెబ్సైట్ ర్యాంకింగ్ ను మొదటి పేజీలోకి తీసుకురావచ్చు . దీని ద్వారా google లో సెర్చ్ చేసే యూజర్స్ కి మన వెబ్సైట్ audience గా మార్చుకోవచ్చు

3. సోషల్ మీడియా మార్కెటింగ్

ప్రస్తుత ఉన్న కాలంలో సోషల్ మీడియా అనేది అందరికీ తెలుసు . కానీ దానిని ఉపయోగిస్తూ మార్కెటింగ్ చేసుకోవచ్చు అనేది కొందరికి మాత్రమే తెలుసు . సోషల్ మీడియా అనగానే మనందరికీ గుర్తుకొచ్చేవి Whatsapp ,Pinterest,Facebook ,Linkedin ఇలా చాలా ఉన్నాయి . ఈ సోషల్ మీడియా అనేది మన ప్రపంచంలో ఎక్కడవున్నా ఒక దగ్గర కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అలాంటి సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఒక కంపెనీ products ని కానీ ,ఒక బ్రాండ్ ప్రచారం కానీ మార్కెటింగ్ చేయడమే సోషల్ మీడియా మార్కెటింగ్ . సోషల్ మీడియా లో ఎన్నో రకాలు ఉన్నాయి ,కానీ మనకు కావాల్సిన కస్టమర్స్ ని ఏ సైట్ లో దొరుకుతారో చూసుకొని ఖర్చు తక్కువతో మనకు కావాల్సిన కస్టమర్లకు మాత్రమే మార్కెటింగ్ చేయడమే సోషల్ మీడియా మార్కెటింగ్ అని చెప్పుకోవచ్చు . దీని గురించి చాలా అవగాహన ఉండాలి దీని ద్వారా మనం బాగా సంపాదించుకోవచ్చు . 

4. గూగుల్ అనలిటిక్స్

ఇది javascript కోడ్ అనే దాని మన వెబ్సైట్ లో ఉన్న పేజీలో ఇంక్లూడ్ చేస్తుంది . యూజర్స్ మన పేజీని విజిట్ చేసినప్పుడు javascript code అనేది javascript file ని చేసి ,google analytics లో ట్రాకింగ్ ఆపరేషన్లా చూపిస్తుంది . Google Analytics ద్వారా మన వెబ్సైట్ లోకి వచ్చే విజిటర్స్ ఎంత మంది వస్తున్నారు ,ఎక్కడ నుంచి వస్తున్నారు ,ఎక్కడ నుంచి ఎక్కువగా వస్తున్నారు ,ఏమి చేస్తున్నారు ,ఎంత సేపు ఉంటున్నారు లాంటి అన్ని విషయాలు మనం ఇందులో తెలుసుకోవచ్చు. దీనిలో ఒక అకౌంట్ క్రియేట్ చేసి అందులో వచ్చిన కోడ్ను తీసుకెళ్లి మన వెబ్సైట్ లో యాడ్ చేసుకోవడమే .

5. గూగుల్ ఆడ్వర్డ్స్

గూగుల్ ఆడ్వర్డ్స్ అనగా ఒక వెబ్సైట్ కి డబ్బులు చెల్లించి మన వెబ్సైట్ గురించి లేదా బ్రాండ్ గురించి ప్రచారం చేసుకోవడానికి ఉపయోగిస్తాం . ఇది వెబ్ సైట్ ట్రాఫిక్ ను ఎక్కువుగా పెంచడానికి మరియు వెబ్సైట్ ను వీక్షించే వారి సంఖ్యను పరిశీలించు కోవడానికి ఉపయోగపడుతుంది . ఏదైనా కంపెనీ పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం పొందడానికి కంపెనీ ప్రచారాలను అభివృద్ధి చేయడానికి ఇది చాలా అవసరం. ఇలాంటి ఆన్లైన్ advertising అనేది లోకల్ ,నేషనల్ ,ఇంటర్నేషనల్ lo టార్గెట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది pay-per-click అనే ఆన్లైన్ advertising ప్లాట్ఫారం, అడ్వేర్టైసర్ల తమ యాడ్స్ను google search engine  results page లో చూపించడానికి ఉపయోగపడుతుంది.

6. ఇమెయిల్ మార్కెటింగ్

ఇమెయిల్ మార్కెటింగ్ అనగా మనం రోజూ ఉపయోగించే మెయిల్స్ కి ఒక బ్రాండ్ గురించి కానీ ,ఒక ప్రోడక్ట్ గురించి కానీ లేదా మన కంపెనీ గురించి కానీ email ద్వారా మన email subscribers కి mail చేయడాని ఇమెయిల్ మార్కెటింగ్ అంటారు . ఇమెయిల్ మార్కెటింగ్ అనేది ఫాస్ట్ గా తక్కువ ఖర్చుతో మన కస్టమర్స్ కి మార్కెటింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది . ఇది పర్సనల్ మరియు టార్గెట్ కస్టమర్లకు messages ద్వారా మార్కెటింగ్ చేస్తుంది . ఇందులో నాలుగు రకాల emails వున్నాయి . informational emails ,digital newsletters ,product update ,transactional emails

7. ఫేస్బుక్ మార్కెటింగ్

Facebook అనగా అందరికీ తెలిసినదే ,కానీ దీనితో మార్కెటింగ్ ఎలా చేయవచ్చు అనేది చాలా తక్కువ మందికి తెలుసు . Facebook ని మొత్తం శాతం 2 billions మందికి పైగా వాడుతున్నారు. అందుకే ఈ Facebook Marketing సోషల్ మీడియాలో ప్రాముఖ్యమైనది . బిజినెస్ పీపుల్ ఏ కాకుండా సెలెబ్రిటీస్ ,పొలిటిషియన్స్ ,వాళ్ళను promote చేసుకోవడానికి Facebook marketing నే వాడుతున్నారు . కేవలం దీని మీదనే focus చేసి Freelancing చేసేవాళ్ళు చాలా మంది వున్నారు . ఇందులో Ads ,campaigning ద్వారా మనీ సంపాదించవచ్చు .ముందుగా facebook account క్రియేట్ చేసి అందులో Facebook పేజీని లేదా facebook గ్రూపుని క్రియేట్ చేసి యాడ్స్ ద్వారా లీడ్స్ సంపాదించుకోవచ్చు

8. యూట్యూబ్ మార్కెటింగ్

Google తరువాత సెర్చ్ ఇంజిన్లో youtube రెండో స్థానాన్ని సంపాదించుకుంది . Youtube నే తమ ప్యాషన్ గా మలుచుకొని మంచి వీడియోలు తీస్తు పేరుపొందిన వారిని మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. అలాగే youtubeni బిజినెస్ విషయాలకు ,బ్రాండ్ ప్రచారాలకు youtube ని ఎలా ఉపయోగిస్తారు అనేది మనం తెలుసుకోవచ్చు .Youtube లో వీడియో ప్లే అవుతున్నప్పుడు మధ్య మధ్యలో వచ్చే బ్రాండ్  ప్రొమోషన్సన్నీఎలా పెట్టవచ్చు అనేది తెలుసుకోగలుగుతారు. ప్రస్తుతం వున్న కాలంలో youtube ద్వారా కస్టమర్లను సులువుగా రాబట్టగలము . అలాగే youtube marketing లో వీక్షించే వారి సంఖ్య పెరిగే కొద్దీ మనీ సంపాదించుకోవచ్చు .Youtube ద్వారా బిజినెస్ ప్రమోషన్ వీడియోలు బాగా పాపులర్ youtubers తో చేయించి బిజినెస్ ని వృద్ధి చేసుకోవచ్చు.

9. అఫిలియేట్ మార్కెటింగ్

అఫిలియేట్ మార్కెటింగ్ అనగా advertisements ద్వారా దీనిలో ఒక కంపెనీ ట్రాఫిక్ ను ఇంప్రూవ్ చేసుకోవడానికి మూడోవ పార్టీ వ్యక్తులకు పరిహారం ఇస్తుంది లేదా కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ మరియు సేవలకు దారితీస్తుంది. మూడోవ పార్టీ వ్యక్తులను affiliates అంటారు వీరు కంపెనీ ప్రమోట్ చేయడం కోసం మార్గాలను కనుగొనడానికి వీరికి కమిషన్ ఫీజు ఇచ్చి కంపెనీ ప్రోత్సహిస్తుంది . అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఆన్లైన్ సేల్స్ లో చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. ప్రస్తుతం ఇది సుమారు 15 నుంచి 20 శాతంలో ఆన్లైన్ సేల్స్ ను చేస్తుంది .CJ Affiliate ,Ebay Partner Network ,Share Sale,Click bank ,Amazon associates కొన్ని మంచి affiliate programs గా చెప్పబడుతున్నాయి.

10. ఇన్ఫ్లుఎంసెర్ మార్కెటింగ్

ఇన్ఫ్లుఎంసెర్   మార్కెటింగ్ అనేది ఒక రకమైన సోషల్ మీడియా మార్కెటింగ్ ,ఇది influencers నుండి ఎండార్స్మెంట్ మరియు ప్రోడక్ట్ ప్రస్తావనలను ఉపయోగిస్తుంది. ఒక బాగా పేరు వున్న వ్యక్తి  మరొక వ్యక్తికి సపోర్ట్ గా ఉంటే ఇన్ఫ్లుయెన్స్ అంటారు . అలాగే ఒక బాగా పేరు ఉన్న వ్యక్తి సపోర్ట్ తో కంపెనీ మార్కెటింగ్ చేయించుకునే దాన్ని ఇన్ఫ్లుఎంసెర్ మార్కెటింగ్ అంటారు . ఒక ప్రోడక్ట్ గాని ,బ్రాండ్ ని గాని లేదా కంపెనీని ప్రమోట్ చేయడాన్ని ఇన్ఫ్లుఎంసెర్  మార్కెటింగ్ బాగా ప్రభావితం చేస్తుంది . ఉదాహరణకు మనం చూస్తూనే ఉంటాం thumbs up యాడ్లో మహేష్ బాబు తో మార్కెటింగ్ చేయడం,మరియు boost ప్రోడక్ట్ ని విరాట్ కోహ్లీ బ్రాండ్ ప్రమోట్ చేయడం దీని ద్వారా ఆయా కంపెనీలు ఎంతగా వృద్ధి పొందారో మన అందరికీ తెలిసినదే  .ఇన్ఫ్లుఎంసెర్ మార్కెటింగ్ సోషల్ మీడియా మార్కెటింగ్ ,కంటెంట్ మార్కెటింగ్ తో సంబంధం కలిగి ఉంటుంది.